వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ లో చేరిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

  •  వార్షిక వైద్య పరీక్షల కోసమే చేరినట్టు సమాచారం
  • ఈ రోజే డిశ్చార్జ్ చేయనున్న వైద్యులు
  • మంత్రి ఆరోగ్యం బాగానే ఉందన్న వైద్య వర్గాలు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 63 ఏళ్ల నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎయిమ్స్ కు వెళ్లారు. ప్రైవేటు వార్డ్ లో చేరినట్టు సమాచారం. 

వార్షిక వైద్య పరీక్షల కోసమే మంత్రి సీతారామన్ ఆసుపత్రిలో చేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరీక్షల అనంతరం మంత్రిని ఈ రోజే డిశ్చార్జ్ చేస్తారని తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Finance Minister
Nirmala Sitharaman
Admitted
AIIMS

More Telugu News